ఆ సీనియర్ నటి పెళ్లి చేసుకోబోతోందా ?

కొంతమంది హీరోయిన్లు వయసు దాటి పోతున్న పెళ్లి జోలికి వెళ్ళరు. అలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వారి లిస్ట్ లో సీనియర్ బోల్డ్ బ్యూటీ ‘టబు’ పేరు ముందు వరుసలో ఉంటుంది. అయితే, 52 ఏళ్ళ వయసులో టబు పెళ్ళికి రెడీ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. కానీ, టబుకి పెళ్లి పై ఎలాంటి ఆససక్తి లేదని టాక్. ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న టబు.. పెళ్లి పై గతంలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

ఇంతకీ, టబు అప్పుడు ఏ కామెంట్స్ చేసిందంటే..’పెళ్లి నాకు సరిపడదు. అందుకేనేమో.. నాకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ.. నాకు తల్లి అవ్వాలనే ఆశ మాత్రం ఉంది. తప్పు లేదు కదా. ఆశ ఎవరికైనా ఉండొచ్చు. అయినా, తల్లి కావడానికి పెళ్లి కావాల్సిందే అంటూ కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. నా దృష్టిలో తల్లి అవ్వాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి కాకుండానే గర్భం దాల్చవచ్చు. సరోగసితో కూడా తల్లి అయ్యే అవకాశం మనకు ఉంది కదా’ అంటూ టబు అప్పుడు చెప్పుకొచ్చింది. కాబట్టి, ఆమె పెళ్లి చేసుకోకపోయినా తల్లి అవుతుంది అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.

Exit mobile version