ప్రభాస్ నటించిన సాహో ఆశించిన ఫలితం ఇవ్వలేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం. భారీ బడ్జెట్ తో తెరకెక్కి అంతకు మించిన అంచనాలతో విడుదలైన సాహో ఆ స్థాయి వసూళ్లను రాబట్టలేక పోయింది. దీనితో తెలుగు రాష్ట్రాలతో పాటు, సౌత్ ఇండియాలో సాహో బయ్యర్లు కొందరు స్వల్ప నష్టాలు, మరికొందరు భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. కాగా ఈ చిత్రం కారణంగా హీరో ప్రభాస్ కూడా కొన్ని ఆర్థిక సమస్యలలో చిక్కుకున్నారని తెలుస్తుంది. సాహో నిర్మాతలు మూవీ కోసం చేసిన అప్పుల విషయంలో ప్రభాస్ హామీ ఉన్నట్లు వినికిడి.
ఇప్పుడు ఆ అప్పుల లెక్క వడ్డీలతో కలిపి భారీగానే పెరగడంతో ఫైనాన్సియర్లు ప్రభాస్ పై ఒత్తిడి తెస్తున్నారట. ప్రభాస్ మిత్రులైన వంశి, ప్రమోద్ లు ఈ చిత్ర నిర్మాతలు కావడంతో ప్రభాస్ మాట సాయం చేశారని, దానివలన ఇప్పుడు వారిని నుండి ప్రభాస్ ఒత్తిడులు ఎదుర్కోవలసి వచ్చిందని రెండు రోజులుగా మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న పుకార్లు. మరి ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియదు కానీ, చాలా మీడియాలలో ప్రభాస్ పై వార్తలు వండివారుస్తున్నారు.