లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా సిద్ధార్ట్ ముఖ్య పాత్రలో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “భారతీయుడు 2”. డీసెంట్ బజ్ నడుమ వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా డివైడ్ టాక్ తో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. అయితే ఈ సినిమా విషయంలో డే 1 కే రన్ టైం విషయంలో కామెంట్స్ వినిపించాయి.
స్లో గా ఉందని కొంత కట్ చేసి ఉంటే బాగుంటుంది అని టాక్ రాగా ఇప్పుడు ఇదే విధంగా సినిమా రన్ టైం గట్టిగానే కట్ చేశారట. మొత్తం మూడు గంటల సినిమాలో 20 నిమిషాలు కట్ చేసేసారట. దీనితో ఇక నుంచి సినిమా 2 గంటల 40 నిమిషాల రన్ టైం తో థియేటర్స్ లో ప్రదర్శింపబడుతుంది అని చెప్పాలి. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యి థియేటర్స్ కి ఎక్కువ మంది జనాన్ని తీసుకొస్తుందో లేదో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.