“లక్కీ భాస్కర్” నిడివి లాక్!?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి నుంచి వస్తున్న మరో డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రమే “లక్కీ భాస్కర్”. మరి సార్ సినిమా తర్వాత మరో క్రేజీ కాన్సెప్ట్ తో వెంకీ తన విమర్శకులకి గట్టి సమాదానం అన్నట్టుగా ఈ సినిమా చేసాడు.

అయితే ట్రైలర్ తో మేకర్స్ మరింత బజ్ ని సంతరించుకోగా ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ రన్ టైం పై తెలుస్తోంది. దీని ప్రకారం ఈ సినిమా నిడివిని మేకర్స్ 2 గంటల 30 నిమిషాలకి కట్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా డీసెంట్ రన్ టైం తోనే రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించారు అలాగే నాగవంశీ, త్రివిక్రమ్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version