“గేమ్ ఛేంజర్” రన్ టైం లాక్..!

“గేమ్ ఛేంజర్” రన్ టైం లాక్..!

Published on Dec 13, 2024 12:59 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వస్తున్న ఈ చిత్రంపై ఇపుడు మరిన్ని అంచనాలు సెట్ చేసుకుంది.

అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తుండగా నిన్ననే వచ్చిన కొత్త ప్రోమోకి సాలిడ్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రన్ టైం పై సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది. దీనితో గేమ్ ఛేంజర్ మొత్తంగా 162 నిమిషాల నిడివితో వచ్చినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

యూకే లో విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ దీనిని లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశారు. సో థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ విధ్వంసం 2 గంటల 42 నిమిషాల పాటుగా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కి వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు