‘సాహో’ సుజీత్ కొత్త సినిమా ఎవరితోనో తెలుసా !

Published on Feb 23, 2021 8:42 pm IST


‘రన్ రాజా రన్’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు సుజీత్ ఆ తరవాత ఏకంగా ప్రభాస్ హీరోగా ‘సాహో’ సినిమా చేసి దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ చిత్రం తెలుగులో పర్వాలేదనిపించినా బాలీవుడ్లో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ విజయంతో సుజీత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హిందీలో. ‘సాహో’ తర్వాత చాలా కాలం కొత్త సినిమాను అనౌన్స్ చేయని సుజీత్ తాజాగా హిందీలో సినిమాను ఫైనల్ చేసుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించనుంది.
ఇదొక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమా గురించి సుజీత్ మాట్లాడుతూ ‘సాహూ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్. కానీ ఈ కొత్త సినిమాలో ఎమోషనల్ యాంగిల్ టచ్ చేస్తున్నాను. ఇందులో పవర్ ప్యాక్డ్ యాక్షన్ కంటెంట్ కూడ ఉంటుంది. సినిమాను త్వరగా మొదలుపెట్టాలని ఉత్సాహంలో ఉన్నాను’ అన్నారు. జీ స్టూడియోస్ సీఈవో సైతం సినిమా భావోద్వేగపూరితంగా ఉంటుందని, సుజీత్ లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో పనిచేయడం గౌరవాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాదిలో మొదలుకానున్న ఈ సినిమా 2022లో విడుదలకానుంది. ఇందులో హీరో హీరోయిన్ ఎవరు, ఎన్ని భాషల్లో సినిమా ఉంటుంది లాంటి ముఖ్యమైన వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :