నయనతార నెక్స్ట్ మూవీ ను తెలుగులో రిలీజ్ చేయనున్న సాహో మేకర్స్!

నయనతార నెక్స్ట్ మూవీ ను తెలుగులో రిలీజ్ చేయనున్న సాహో మేకర్స్!

Published on Dec 5, 2022 1:11 PM IST


లేడీ సూపర్ స్టార్ నయనతార తదుపరి చిత్రం కనెక్ట్ డిసెంబర్ 22, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, తమిళ సినిమా తెలుగులో ఏకకాలంలో విడుదల కావడం ఖాయమని, ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్టు సమాచారం.

అంతేకాకుండా ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఒక గ్లింప్స్ కూడా రిలీజైంది. ఈ హర్రర్ చిత్రంలో సత్యరాజ్, వినయ్ రాయ్, హనియా నఫీషా మరియు ఇతరులు ప్రముఖ పాత్రలు పోషించారు. రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పృథ్వీ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు