‘సలార్-2’ నా బెస్ట్ స్క్రిప్ట్ – ప్రశాంత్ నీల్

‘సలార్-2’ నా బెస్ట్ స్క్రిప్ట్ – ప్రశాంత్ నీల్

Published on Dec 22, 2024 1:30 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సలార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, తాజాగా సలార్-2 గురించి ప్రభాస్ ఫ్యాన్స్‌కు దర్శకుడు ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఇంతకీ, ఈ క్రేజీ డైరెక్టర్ ఏం చెప్పాడంటే.. ‘సలార్-2 సినిమాని నా అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ సినిమా స్క్రిప్ట్ బహుశా ఇప్పటి వరకూ నా అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను’ అని కామెంట్స్ చేశారు.

ప్రశాంత్ నీల్ ఇంకా మాట్లాడుతూ.. ‘సలార్ 2 సినిమా విషయంలో ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఆ మూవీని తీస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. కాగా ఆ మధ్య ‘సలార్ 2’ సినిమా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పార్ట్-2ని త్వరగా పూర్తి చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు. మొత్తానికి సలార్ 2తో ప్రభాస్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. కాగా ఈ సీక్వెల్‌లో శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు శ్రియా రెడ్డి నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు