సమీక్ష : ‘శారీ’ – RGV మరో కళాఖండం..!

సమీక్ష : ‘శారీ’ – RGV మరో కళాఖండం..!

Published on Apr 4, 2025 4:41 PM IST

saaree Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 4, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.25/5
నటీనటులు : ఆరాధ్య దేవి, సత్య యాదు, సాహిల్ సంభ్యల్, అప్పాజీ అంబరీష్
దర్శకత్వం : గిరి కృష్ణ కమల్
నిర్మాణం : రవి శంకర్ వర్మ
సంగీతం : ఆనంద్ రాగ్
సినిమాటోగ్రఫీ : శబరి
ఎడిటర్ : రాజేష్ పేరంపల్లి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘శారీ’ నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులను ఎంతమేర మెప్పించాడో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
ఆరాధ్య దేవి(ఆరాధ్య దేవి) తన జీవితాన్ని ఒంటరిగా గడుపుతూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, ఆమెను ఇష్టపడే కిట్టు(సత్య యాదు) కారణంగా ఆరాధ్య జీవితం గందరగోళంగా మారుతుంది. ఆమెను రహస్యంగా ఫాలో అయి, ఆమెకు సంబంధించిన ఫోటోలు తీస్తుంటాడు కిట్టు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తి, అటుపై వేధింపులు మొదలుపెడతాడు. ఆమె కుటుంబాన్ని కూడా బెదిరిస్తుంటాడు. ఆరాధ్య అంటే కిట్టుకి ఎందుకంత మోజు..? అతడు ఆమె వెనకాల పడటానికి అసలైన కారణం ఏమిటి..? పరిస్థితులు భయంకరంగా మారుతుండటంతో ఆరాధ్య ఏం చేస్తుంది..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఓ సీరియస్ పాయింట్ టచ్ చేశాడు. సోషల్ మీడియాలోని ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని.. గుడ్డిగా అన్నింటినీ నమ్మితే సమస్యల్లో చిక్కుకోవడం ఖాయమని ఆయన ఈ సినిమా ద్వారా తెలిపారు. ఈ పాయింట్ వరకు సినిమా క్లియర్‌గా ఉంది.

ఆరాధ్య కొన్ని సీన్స్ వరకు బాగానే ఆకట్టుకుంది. కానీ, ఆమె పాత్రకు కావాల్సిన డెప్త్ లభించలేదని అనిపిస్తుంది. సత్య యాదు పాత్ర మాత్రం సినిమాకే హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి. అతడు చేసే యాక్షన్ ప్రేక్షకులను ఇబ్బందికి గురిచేస్తుంది. అలాంటి పాత్రకు ఇలాంటి రియాక్షన్ రావడమే ఈ పాత్ర ప్రత్యేకత. ప్రీ-క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు తన పాత్ర అద్భుతంగా ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :
సమాజానికి ఉపయోగపడే ఓ సందేశాన్ని అందించే క్రమంలో అనవసరమైన అంశాలు తెరపైకి తీసుకురావడం వృథా. రామ్ గోపాల్ వర్మ తన ‘శారీ’ చిత్రంలో ఇదే పంథాలో అవసరం లేని అశ్లీలాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఒక అందాన్ని పొగడటంలో.. దాన్ని కామంగా చూపించడంలో చాలా తేడా ఉంటుంది. ఈ విషయంలో వర్మ తన హద్దులు దాటాడాని చెప్పాలి.

ఓ సైకో ఒక అమ్మాయి విషయంలో ఎలాంటి తీవ్రమైన స్థాయికి చేరుకున్నాడు.. అనే కోర్ పాయింట్‌ను అతి కిరాతకంగా చూపెట్టారు. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఏమాత్రం నచ్చదు. ఆరాధ్య పాత్రను మరింత బలంగా చూపెట్టే అవకాశం ఉన్నా, కేవలం సోషల్ మీడియా స్టార్‌గా ఆమెను పరిమితం చేశారు. కొన్ని సీన్స్, సాంగ్స్‌లో మాత్రమే కనిపించేలా ఆమె పాత్ర డిజైన్ చేయడంతో ఆమె ఈ సినిమాలో ఎందుకు ఉందో కూడా అర్థం కాని పరిస్థితి.

ఇక మిగతా నటీనటులు ఎవరూ పెద్దగా గుర్తుండరు. ఇక ఈ సినిమాలో మరో మేజర్ మైనస్ పాయింట్ ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్. సినిమాలో చాలా భాగం సరైన లిప్ సింక్ లేకుండా ముందుకు వెళ్తుంది. ఇలాంటి ఔట్‌పుట్‌కు దర్శకుడు ఓకే చెప్పాడంటే నిజంగా బాధాకరం.

సాంకేతిక వర్గం :
దర్శకుడు గిరి కృష్ణ కమల్ పూర్తిగా రామ్ గోపాల్ వర్మ తప్పుడు విజన్‌కు లొంగిపోయినట్లు కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా యావరేజ్‌గా కనిపిస్తుంది. సినిమాలోని పేస్.. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఈ సినిమా ప్రేక్షకుల అసహనాన్ని పరీక్షిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఆకట్టుకోదు. సినిమా నిడివి కేవలం 142 నిమిషాలు ఉన్నా, చాలా లెంగ్తీ సినిమాగా దీన్ని చూస్తే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు నామమాత్రంగా కనిపించాయి.

తీర్పు :
ఓవరాల్‌గా.. ‘శారీ’ చిత్రం కూడా రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన ఓ బ్లండర్ చిత్రంగా నిలిచింది. ఆన్‌లైన్ సేఫ్టీ వంటి ముఖ్యమైన సందేశాన్ని కూడా అశ్లీల ప్రదర్శనతో ట్రాక్ తప్పేలా చేశాడు. ఆరాధ్యను ఏమాత్రం పూర్తిగా వినియోగించుకోలేదని అర్థమవుతుంది. సత్య యాదు తన పాత్రలో ఒదిగిపోయాడు. కానీ, సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోవడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలు లేకపోవడంతో ఈ సినిమాను ఆడియెన్స్ రిజెక్ట్ చేశారు.

123telugu.com Rating: 1.25/5

Reviewed by 123telugu Team 

Click Her For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు