విడుదల తేదీ : మే 03, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: వరలక్ష్మి శరత్ కుమార్, గణేష్ వెంకటరామన్, శశాంక్, మైమ్ గోపి, బేబీ వివేక్ష తదితరులు
దర్శకుడు: అనిల్ కాట్జ్
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
సంగీత దర్శకుడు: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన తన మొదటి ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం “శబరి” కూడా ఒకటి. మరి ఈ చిత్రంతో వరలక్ష్మి శరత్ కుమార్ ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
ఇక కథ లోకి వస్తే సంజన(వరలక్ష్మి శరత్ కుమార్) అలాగే అరవింద్ (గణేష్ వెంకటరామన్) లు తమ కాలేజీ టైం లోనే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారికి రియా(బేబీ వివేక్ష) అనే కూతురు కూడా ఉంటుంది. కానీ ఓరోజు తన భర్త చేసిన చీప్ పని వల్ల ఆమె అతని నుంచి తన కూతురితో కలిసి విశాఖపట్నంకు వచ్చేస్తుంది. అయితే సంజనకు తన తల్లితో మంచి అనుబంధం ఉంటుంది కానీ ఆమె తన చిన్నతనం లోనే చనిపోవడం, ఇంకోపక్క తనకి తన కూతురుతో ఉన్న బంధం, వీరి కథలోకి సూర్య(మైమ్ గోపి) ఎందుకు ఎంటర్ అవుతాడు. రియా కోసం ఎందుకు వెతుకుతూ ఉంటాడు? వీరందరికీ ఉన్న కనెక్షన్ ఏంటి? రియాని సంజన కాపాడుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మెయిన్ లీడ్ నటీనటులు నటన బాగున్నాయి. ఒక తల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి ఆమెలోని వెర్సటాలిటీ చూపించారు. పలు ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ తరహా సీన్స్ లో కానీ నీట్ పెర్ఫామెన్స్ ని కనబరిచారు. ఇక ఆమెతో పాటుగా తన కూతురుగా నటించిన బేబీ వివేక్ష కూడా బాగా నటించింది.
ఇక వీరితో పాటుగా మైమ్ గోపి, శశాంక్, ఇంకా గణేష్ వెంకటరామన్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇక వీటితో పాటుగా సినిమాలో ఫస్టాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ మొత్తం డీసెంట్ గా అనిపిస్తుంది. ఆ సమయంలో బిల్డ్ అయ్యే ట్విస్ట్ కానీ సస్పెన్స్ ఫ్యాక్టర్ కానీ చూసేందుకు మెప్పిస్తాయి. అలాగే ఈ కొన్ని సీన్స్ లో గోపి సుందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్ గా ఉంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో డిజప్పాయింట్ చేసే అంశాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అసలు సినిమా మొదలైన నాటి నుంచే నెమ్మదిగా సాగే బోరింగ్ కథనంతో సాగదీతగా అనిపిస్తుంది. అంతే కాకుండా ప్రీ ఇంటర్వెల్ వరకు మినిమమ్ ఆసక్తి కూడా కలగదు. ఇంకా కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అందులోని ఎమోషన్స్ కూడా ఏమాత్రం వర్కౌట్ అవ్వవు. ఇక వీటితో ఆ సెకండాఫ్ మరింత నిరుత్సాహ పరుస్తుంది.
ఊహాజనితంగా సాగే కథనం, యిట్టె అర్ధం అయ్యిపోయే డైలాగులు సినిమాని మరింత పేలవంగా మార్చివేస్తాయి. ఇక వీటితో పాటుగా చాలా సీన్స్ లో లాజిక్స్ మిస్ అయ్యాయి. అసలు సినిమాలో చాలా సీన్స్ ప్రాంతాన్ని విశాఖగా చూపించి అందులో హైదరాబాద్ మాల్స్ ఏరియాలు చూపించడం అనేది పెద్ద బ్లండర్ గా చెప్పాలి.
ఇంకా ఓ సీన్ అయితే వరలక్ష్మి శరత్ కుమార్ పై వర్షం పడుతున్నా కూడా తడవకుండా కనిపించడం గమనార్హం. ఇక వీటితో పాటుగా మరికొన్ని సీన్స్ ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి ఇంకా కొన్ని రిపీటెడ్ గా అనిపిస్తాయి. దీనితో సినిమాపై ఆసక్తి ఉండగా ఉండగా మరింత సన్నగిల్లుతుంది.
సాంకేతిక వర్గం :
సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు, కానీ టెక్నికల్ టీం పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. గోపి సుందర్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఓకే కానీ సెకండాఫ్ లో అయితే కొట్టిందే కొట్టి బోర్ తెప్పిస్తాడు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. డైలాగ్స్ చాలా యావరేజ్ గా ఉన్నాయి.
ఇక దర్శకుడు అనీల్ కాట్జ్ విషయానికి వస్తే.. తాను కొంతమేర థ్రిల్ చేసే సబ్జెక్టు పట్టుకున్నారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో మెప్పించే విధంగా ఆవిష్కరించలేకపోయారు. చాలా బోరింగ్ అండ్ విసుగు తెప్పించే నరేషన్ తో కథనాన్ని తాను నడిపించారు. ఒక్క ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ తప్ప అసలు సినిమాలో చెప్పుకోడానికి సరైన సన్నివేశం కానీ ఎమోషన్స్ కానీ కనిపించవు. వీటితో అయితే తన వర్క్ ఈ సినిమాకి చాలా వీక్ గానే అనిపిస్తుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “శబరి” చిత్రంలో నటీనటుల పెర్ఫామెన్స్ లు వరకు ఓకే అలాగే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వరకు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఈ ఫ్యాక్టర్ ని దర్శకుడు సెకండాఫ్ లో మైంటైన్ చేయడంలో విఫలం అయ్యారు. పైగా వర్కౌట్ అవ్వని ఎమోషన్స్, సాగదీతగా ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే లు బాగా నిరుత్సాహ పరుస్తాయి. వీటితో అయితే ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team