విషాదం: “బలగం” జానపద గాయకుడు మొగిలయ్య కన్నుమూత

విషాదం: “బలగం” జానపద గాయకుడు మొగిలయ్య కన్నుమూత

Published on Dec 19, 2024 11:01 AM IST

ప్రముఖ కమెడియన్ టర్న్డ్ దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించిన సెన్సేషనల్ ఎమోషనల్ హిట్ చిత్రం “బలగం” కోసం తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యంగ్ నటీనటులు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా చేసిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ లో ముద్ర వేసుకుంది. మరి ఈ సినిమా అంతలా ప్రభావం చూపించడానికి కారణం వేణు రాసుకున్న కథ అందులో ఎమోషన్స్ అలాగే సినిమా క్లైమాక్స్ లో జానపద గేయం అని కూడా చెప్పాలి.

మరి సినిమా క్లైమాక్స్ మొత్తాన్ని తన పాటతో కదిలించిన ప్రముఖ జానపద గాయకులు మొగిలయ్య ఇపుడు కన్ను మూశారన్న వార్త విషాదంగా మారింది. అయితే గత కొన్నాళ్ల నుంచి మొగిలయ్య కిడ్నీ, హృదయానికి సంబంధించి సమస్యలతో బాధ పడుతున్నారట. వరంగల్ నుంచి హైదరాబాద్ లో మెరుగైన చికిత్స కోసం తరలించినప్పటికీ పరిస్థితి చేయి దాటడంతో ఈ డిసెంబర్ 19 తెల్లవారు జాము సమయంలో వారు కన్ను మూశారట.

దీనితో మొగిలయ్య వార్త విన్న నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మొగిలయ్యకి మెగాస్టార్ చిరంజీవి కూడా ఆర్ధిక సాయం అందించారు. మరి తరాలు మర్చిపోతున్న మూలాలని మళ్ళీ తట్టి లేపిన ఇలాంటి జానపద గాయకులు లేకపోవడం ఖచ్చితంగా తీరని వెలితే అన్ని చెప్పాలి. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు