విషాదం : ప్రముఖ దర్శకుడు బాబీ కి పితృ వియోగం..!

విషాదం : ప్రముఖ దర్శకుడు బాబీ కి పితృ వియోగం..!

Published on Aug 28, 2022 1:42 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ లో తన ఫస్ట్ సినిమా “పవర్” తోనే సత్తా చాటి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే స్థాయికి ఎదిగిన దర్శకుడు కే ఎస్ రవీంద్ర(బాబీ) కూడా ఒకరు. మరి బాబీ అయితే ప్రస్తుతం మెగాస్టార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న తన ఇంట ఇప్పుడు తీరని విషాదం చోటు చేసుకుంది.

మరి వివరాలలోకి వెళ్లినట్టు అయితే.. దర్శకుడు బాబీ తండ్రి కొల్లి మోహనరావు గత కొంత కాలం నుంచి కాలేయానికి సంబంధించిన సమస్యతో బాధ పడుతుండగా కొన్నాళ్ల నుంచి హైదరాబాద్ ఓ ప్రయివేట్ ఆసుపతి లోనే చికిత్స తీసుకుంటున్నారు.

అయితే దురదృష్టవశాత్తు తాను తన 69వ ఏట ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్టుగా ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. దీనితో బాబీ ఇంట తీరని విషాదం నెలకొంది. మరి బాబీ ఇంట జరిగిన ఈ విషాద ఘటనపై పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు