బాలీవుడ్ ప్రముఖ నటి అలాగే మోడల్ కూడా అయినటువంటి మలైకా అరోరా కోసం అందరికీ తెలిసిందే. తెలుగులో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ హిట్ “గబ్బర్ సింగ్” సినిమాలో కెవ్వు కేక సాంగ్ తో తాను టాలీవుడ్ ఆడియెన్స్ కి కూడా పరిచయం అయ్యారు. అయితే ఇప్పుడు మలైకా అరోరా కుటుంబంలో ఒక ఊహించని విషాద సంఘటన చోటు చేసుకుంది.
ఆమె తండ్రి అనీల్ అరోరా అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్న వార్తలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ముంబై, బాంద్రాలోని తమ ఇంటి బిల్డింగ్ ఆరవ ఫ్లోర్ నుంచి అనీల్ అరోరా దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇది షాకింగ్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ముంబై పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ అనీల్ అరోరా ఆత్మ హత్య వాంగ్మూలం లాంటిది ఏదీ వారు కనుక్కోలేదట.
దీనితో వారి మరణంకి కారణం ఏంటి అనేది గోప్యం గానే ఉండిపోయింది. మరి ఈ ఊహించని ఘటనతో మలైకా ఇంట తీరని విషాదం నెలకొంది అని చెప్పాలి. ప్రస్తుతం మలైకా సహా తన భర్త అర్జున్ కపూర్, సల్మాన్ ఖాన్ కుటుంబీకులు అంతా ముంబై చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.