మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తో ‘మడత కాజా‘ అలాగే మరో సినిమా ‘సంఘర్షణ‘ వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్ (54) ఈరోజు ఉదయం స్వర్గస్తు లయ్యారు. దీనితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అయితే సినిమాల పై ఇష్టంతో ఓ వైపు గృహ నిర్మాణ రంగంలో బిజీ గా ఉంటూనే సినిమాలు అంటే ఇష్టం ఉండడంతో సినీ నిర్మాణం లోకి కూడా తాను అడుగు పెట్టారు.
అయితే త్వరలో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఎ ఐ జి హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకుని వస్తారు అని సన్నిహితులు , కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగటం వారందరిలో విషాదాన్ని నింపింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అంత్య క్రియలు ఈ రోజు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మన 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.