విషాదం: కళ్యాణ్ కి పేరు పెట్టిన మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత

విషాదం: కళ్యాణ్ కి పేరు పెట్టిన మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత

Published on Mar 25, 2025 10:05 AM IST

మన టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఇపుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ పలు అంశాల్లో టాలెంట్ కలిగిన వారు అందరికీ తెలిసిందే. మరి వీటిలో తాను కరాటే, కిక్ బాక్సింగ్ లాంటివి కూడా చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే తమ్ముడు తదితర సినిమాల్లో పవన్ ఏ రీతిలో పోరాటాలు చేసారో అందరికీ తెలిసిందే.

మరి పవన్ తమ్ముడు సినిమాలో తాను కిక్ బాక్సింగ్ నేర్చుకునేందుకు తన గురువు దగ్గర ఎంతో ఎదురు చూస్తాడు కానీ ఆ సీన్ తనకి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసారని చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే అలా పవన్ పట్టుబట్టి శిక్షణ తీసుకున్న ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైని కన్ను మూశారన్న విషాద వార్త ఇపుడు బయటకి వచ్చింది.

షిహాన్ ఒక మార్షల్ ఆర్ట్స్ లోనే కాకుండా విలు విద్య సహా నటన, చిత్రకారునిగా ఇలా మరిన్ని కళల్లో ఆరితేరిన వారు. అయితే తాను గత కొంత కాలం నుంచి లుకేమియాతో బాధ పడుతుండగా వారు ఈ మార్చ్ 25 ఉదయం 1 గంట 45 నిమిషాలకి ట్రీట్మెంట్ లోనే కన్ను మూసినట్టుగా నిర్ధారణ అయ్యింది.

అయితే తనకి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కుమార్ గా పరిచయం అయితే తన శిక్షణ సమయంలో తానే పవన్ అనే పేరు పెట్టినట్టుగా ఆ మధ్య ఇంటర్వ్యూలో తెలిపారు. ఎన్నో వేల మందికి శిక్షణ ఇచ్చిన తాను ఇపుడు కన్ను మూయడం బాధాకరం. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ప్రార్ధిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు