ఒకప్పుడు టెలివిజన్ ఛానెల్స్ లో తాజ్ టీ యాడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది మరి ఆ యాడ్ కి ఒకతను తబలా వాయిస్తూ ప్రాణం పోసినట్టుగా అనిపించిన అనుభూతులు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండి ఉంటాయి మరి ఆ ప్రముఖ తబలా విద్వాంసులే జాకీర్ హుస్సేన్. ఆ యాడ్ తో దేశ వ్యాప్తంగా తను మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాగే భారతీయ క్లాసికల్ సంగీతంలో అపారమైన సేవలు అందించిన తను ఇపుడు కన్నుమూశారు అనే వార్త విషాదంగా మారింది.
మరి మన దేశపు అత్యున్నత గౌరవ పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్ అలాగే పద్మవిభూషణ్ కూడా తాను అందుకున్నారు. మరి సంగీత ప్రపంచంలో ఎంతో వన్నె తెచ్చిన తను నేడు డిసెంబర్ 15 తన 73 ఏట కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఆయన సాన్ ఫ్రాన్సిస్కో లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అని తెలుస్తోంది. దీనితో ఈ వార్త విన్న అభిమానులు ప్రముఖులు తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి అని మా 123తెలుగు టీం కోరుకుంటుంది. ఓం శాంతి.