విడాకులు తీసుకోవడంలో తప్పు లేదు – సదా

విడాకులు తీసుకోవడంలో తప్పు లేదు – సదా

Published on Jun 17, 2024 10:01 AM IST

హీరోయిన్ సదా ప్రస్తుతం తన కెరీర్ పై మళ్లీ ఫోకస్ పెట్టింది. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సదా తన పెళ్లిపై వచ్చిన రూమర్స్‌కు చెక్‌ పెట్టింది. తాను ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నానని, పెళ్లి చేసుకుని దానిని వదులుకోలేనని సదా తెలిపింది. సదా ఇంకా ఏం మాట్లాడింది అంటే.. ఆమె మాటల్లోనే విందాం. ‘నిజానికి పెళ్లి పై నాకు గౌరవం ఉంది. కానీ, ఇంతవరకూ నా హృదయానికి ఎవరూ దగ్గర కాలేదు. ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను’ అంటూ సదా చెప్పుకొచ్చింది.

సదా తన ప్రేమ గురించి కూడా మాట్లాడుతూ.. ‘అవును, నేను అరేంజ్‌డ్ మ్యారేజ్‌కు పూర్తిగా వ్యతిరేకం. కచ్చితంగా నేను లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను. ఇక పెళ్లి తర్వాత భాగస్వామిని భరించడం కష్టం అనిపిస్తే విడాకులు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇబ్బందులు పడుతూ కాపురం చేయాల్సిన అవసరం లేదు కదా’ అని సదా చెప్పింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు