పవన్ కి సాయి ధరమ్ తేజ్ కూడా వెరీ స్పెషల్ గిఫ్ట్

పవన్ కి సాయి ధరమ్ తేజ్ కూడా వెరీ స్పెషల్ గిఫ్ట్

Published on Jun 16, 2024 1:08 PM IST

ఇటీవల ప్రముఖ హీరో ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇటీవల దేశ వ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాము. మరి ఈ హ్యాపీ మూమెంట్ లో మెగా కుటుంబం అంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా నిన్ననే చిరు దంపతులు పవన్ కి ఒక ఖరీదైన స్పెషల్ పెన్ ని బహుమతిగా అందించారు. మరి వారితో పాటుగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా అంతకు మించే మావయ్య కోసం చేస్తున్నాడు.

నిన్ననే కాలి నడకన తిరుమల కొండా ఎక్కి మొక్కు తీర్చుకున్నాడు. మరి ఈ తర్వాత ఒక బ్యూటిఫుల్ పోస్ట్ ని పెట్టాడు. తనకి చిన్నప్పుడు “స్టార్ వార్స్” (Star Wars) లెగో ని పరిచయం చేసిన నా ప్రియమైన జేడీ, డెప్యూటీ సీఎం మావయ్యకి ఇప్పుడు తనలోని చిన్న పిల్లాడికి ఆ బహుమతిని ఇచ్చే అవకాశం దక్కింది అని ఇద్దరి పిక్ కలిపి పెట్టి పెట్టాడు. ఇందులో ఆ స్టార్ వార్స్ పెట్టెని గమనించవచ్చు. దీనితో ఇప్పుడు ఈ పోస్ట్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు