మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన సాయి ధరమ్ తేజ్

మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన సాయి ధరమ్ తేజ్

Published on Jul 14, 2015 10:31 AM IST

Sai-Dharma-Tej
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకూ ‘రేయ్’, ‘పిల్లానువ్వులేని జీవితం’ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మూడవ సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కెరీర్ ప్రారంభం నాటి నుంచి కాస్త స్లోగా ఒకదాని తర్వాత ఒకటి అన్న ఫార్మాట్ లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు సినిమాలను ఎంచుకోవడంలో స్పీడ్ పెంచాడు. ఇటీవలే పటాస్ తో సక్సెస్ అందుకున్న ఐల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

గతంలో కళ్యాణ్ రామ్ తో ‘ఓం’ సినిమా చేసిన సునీల్ రెడ్డి డైరెక్షన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చెయ్యడానికి సాయి ధరమ్ తేజ్ సైన్ చేసాడు. అది కూడా ఓ పర్ఫెక్ట్ యాక్షన్ డ్రామాని సిద్దం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం లొకేషన్స్ ని కూడా ఫైనలైజ్ చేసారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ఎక్కువ భాగం శ్రీలంకలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటించనున్న హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. ఓ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాని నిర్మిస్తాడని సమాచారం. సునీల్ రెడ్డికి టెక్నికల్ గా మంచి నాలెడ్జ్ ఉండడం వలన ఈ సినిమాలో హై రేంజ్ టెక్నికల్ వాల్యూస్ ఉంటాయని సమాచారం.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇది పూర్తవగానే అనిల్ రావిపూడి, సునీల్ రెడ్డి సినిమాలను ఒకే సారి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు