గ్లింప్స్ టాక్.. వైల్డ్ కంబ్యాక్ సిద్ధం చేసుకుంటున్న సాయి దుర్గ తేజ్..


మెగా కుటుంబం నుంచి వచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో యువ హీరో మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ కూడా ఒకడు. మరి తన ఎంట్రీ తోనే ఇండస్ట్రీలో సాలిడ్ వెల్కమ్ ని అందుకున్నాడు. అయితే తన లైఫ్ లో జరిగిన ఓ విషాద ఘటన ఎలా తన జీవితాన్ని మలుపు తిప్పింది అనేది అందరికీ తెలుసు.

మరి దాని తర్వాత కూడా చేసిన రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలవగా ఇపుడు వస్తున్న “సంబరాల ఏటి గట్టు” తో మాత్రం ఒక వైల్డ్ కంబ్యాక్ ని తాను ప్రిపేర్ చేసుకుంటున్నాడు అని చెప్పి తీరాలి. యువ దర్శకుడు రోహిత్ కేపి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం నుంచి మేకర్స్ ఇపుడు రిలీజ్ చేసిన గ్లింప్స్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉందని చెప్పాలి.

ఒక కీలక వ్యక్తి కోసం క్రేజీ ఇంట్రో ఇస్తూ అతడి రక్తం కోసం ఎదురు చూస్తున్న కత్తులతో ఒకడు ఉన్నాడు అన్నట్టుగా మొదలైన ఈ ఈ గ్లింప్స్ అందులో సాయి దుర్గ తేజ్ ఫిజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. అలాగే తన బాడీ లాంగ్వేజ్ కానీ తన పవర్ఫుల్ డైలాగ్స్ కానీ స్టన్నింగ్ అని చెప్పి తీరాలి. ఇక దీనికి అనుగుణంగా అజనీష్ లోకనాథ్ ఇచ్చిన స్కోర్ కూడా ఈ గ్లింప్స్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది.

ఇలా మొత్తంగా అయితే ఈ గ్లింప్స్ మాత్రం ఊహించని లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ని మేకర్స్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని హను మాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version