పవన్ సినిమాలో సాయి పల్లవి లేనట్టేనా ?

Published on Mar 3, 2021 3:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రాల్లో మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కూడ ఒకటి. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే రెగ్యులర్ షూట్ మొదలైంది. ఇందులో పవన్ సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుందని గతంలో వార్తలొచ్చాయి. ఆమె సినిమాకు సైన్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏదీ రాలేదు. తీరా ఇప్పుడు సాయి పల్లవి ఆ సినిమాలో చేయట్లేదనే వార్తలు మొదలయ్యాయి.

సాయి పల్లవి ఇప్పటికే పలు సినిమాలకు సైన్ చేసి ఉండటంతో పవన్ సినిమాకు డేట్స్ కేటాయించలేక సినిమా చెయ్యట్లేదని అంటున్నారు. అసలు నిజంగా పవన్ నిర్మాతలు సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారా, ఆమె నో చెప్పిందా లేకపోతే ఇవన్నీ ఒట్టి పుకార్లేనా అనేది తేలాల్సి ఉంది. ఈ ప్రశ్నలకు సాయి పల్లవి లేదా చిత్రం బృందం నుండే సమాధానం రావాలి. త్రివిక్రన్ శ్రీనివాస్ కథనం, మాటలు అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :