రూమర్స్ పై సాయి పల్లవి ఫైర్.. డీటెయిల్స్ ఇవే

రూమర్స్ పై సాయి పల్లవి ఫైర్.. డీటెయిల్స్ ఇవే

Published on Dec 12, 2024 11:09 AM IST


మన తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన రీసెంట్ చిత్రం “అమరన్” తో సెన్సేషనల్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంతో పాటుగా తెలుగులో నాగ చైతన్యతో “తండేల్” అనే భారీ సినిమా తాను చేస్తుంది. ఇక ఈ సినిమా సహా హిందీలో “రామాయణ” కూడా చేస్తుంది.

కానీ ఈ చిత్రం విషయంలో తనపై వచ్చిన రూమర్స్ పై సాయి పల్లవి ఇపుడు ఫైర్ అయ్యింది. ఈ చిత్రం చేస్తున్న నేపథ్యంలో సాయి పల్లవి అసలు నాన్ వెజ్ తీసుకోవడం లేదని ఆమె సినిమా పూర్తయ్యేవరకు తన లైఫ్ స్టైల్ ని మార్చేసుకుంది అంటూ పలు రూమర్స్ తమిళ సినీ వర్గాల్లో స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో సాయి పల్లవి సోషల్ మీడియాలో ఫైర్ అయ్యింది.

తన ఎక్స్ ఖాతాతో ఇన్ని రోజులు ఇలాంటి వార్తలపై ఊరుకున్నాను కానీ ఇక నుంచి నాపై ఇలాంటి ఆధారాలు లేని వార్తలు ఏవైనా స్ప్రెడ్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఇదే కొనసాగితే మాత్రం లీగల్ గా వెళ్తా అని కూడా ఖరాఖండిగా తేల్చేసింది. దీనితో తన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు