‘తండేల్’ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి మిస్.. కారణం ఇదే!

‘తండేల్’ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి మిస్.. కారణం ఇదే!

Published on Feb 1, 2025 8:00 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన క్రేజీ చిత్రాల్లో తండేల్ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేయగా పూర్తి లవ్ స్టోరీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసేందుకు పలు భాషల్లో ఈ చిత్ర ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే, రీసెంట్‌గా బాలీవుడ్‌లో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హిందీ ట్రైలర్‌ను అమీర్ ఖాన్ లాంచ్ చేశారు. కానీ, ఈ ఈవెంట్‌కు సాయి పల్లవి డుమ్మా కొట్టింది. దీంతో ఈ ఈవెంట్‌కి ఆమె ఎందుకు రాలేదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే, సాయి పల్లవికి తీవ్ర జ్వరం రావడంతో ఆమె ఈ ఈవెంట్‌కు హాజరుకాలేదని.. డాక్టర్లు ఆమెను పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తుంది. దీంతో ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు