‘ఎల్లమ్మ’కు స్టార్ బ్యూటీ నో..?

‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటాడు వేణు యెల్దండి. పక్కా ఎమోషనల్ కథగా ‘బలగం’ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఈ డైరెక్టర్ సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌తో తెరకెక్కించబోతున్నట్లు వేణు గతంలోనే వెల్లడించాడు. ఇక ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు.

అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ సాయి పల్లవి నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కథ నచ్చడంతో సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే, ఆ సమయంలో సాయి పల్లవి ఖాళీగా లేదని.. అందుకే ఈ సినిమాకు ఆమె నో చెప్పిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

దీంతో ‘ఎల్లమ్మ’ మేకర్స్ కూడా సాయి పల్లవి ప్లేస్‌లో వేరొక హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. మరి సాయి పల్లవిని రీప్లేస్ చేసే హీరోయిన్ ఎవరై ఉంటారో చూడాలి.

Exit mobile version