ఇంటెన్స్ పోస్టర్ తో “అమరన్” తెలుగు ట్రైలర్ టైం ఖరారు


కోలీవుడ్ లో టాలీవుడ్ లో మంచి ఆదరణ ఉన్న తమిళ యువ హీరోస్ లో శివ కార్తికేయన్ కూడా ఒకరు. మరి తాను హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా “అమరన్”. మరి ఈ దీపావళి కానుకగా రాబోతున్న ఈ చిత్రాన్ని మేకర్స్ తమిళ్ సహా తెలుగులో రిలీజ్ కి తీసుకొస్తుండగా తమిళ్ లో ఆల్రెడీ ఆడియో లాంఛ్, టీజర్ లు కూడా వచ్చాయి.

అయితే మేకర్స్ ఇప్పుడు శివ కార్తికేయన్ పై ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో తెలుగు సహా తమిళ్ ట్రైలర్ టైం ని లాక్ చేసేసారు. మరి ఈ ట్రైలర్ ని రేపు అక్టోబర్ 23 సాయంత్రం 6 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి తెలుగులో ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాణం వహించారు. అలాగే ఈ అక్టోబర్ 31న సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

Exit mobile version