కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన శివ కార్తికేయన్ హీరోగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు మహేంద్రన్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా “అమరన్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి బజ్ నెలకొనగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందిస్తూ వస్తున్నారు. అలా లేటెస్ట్ గా నాచురల్ బ్యూటీ సాయి పల్లవిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే అందించారు.
మరి ఆమెని ఈ సినిమాలో ఇందు రెబాక వర్గీస్ అనే పాత్రలో కనిపించనుండగా కొన్ని నిజ జీవిత విజువల్స్ తో పాటుగా సాయి పల్లవి పాత్రని చూపించడం బాగుందని చెప్పాలి. అలాగే ఈ వీడియోలో మ్యూజిక్ కూడా ఇంపుగా ఉండగా శివ కార్తికేయన్ తో మంచి కెమిస్ట్రీ ఈ సినిమాలో కనిపించేలా ఉందని చెప్పాలి. మొత్తానికి అయితే అమరన్ నుంచి సాయి పల్లవి ఫ్యాన్స్ కి బీయూటిఫుల్ ట్రీట్ ని అందించారని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణం వహిస్తుండగా ఈ దీపావళి కానుకగా సినిమా రిలీజ్ కి రాబోతుంది.