స్టార్ రైటర్ కథలో సాయి తేజ్ ?

Published on Oct 17, 2020 11:53 pm IST


సుప్రీం హీరో సాయి తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తున్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ఆల్ రెడీ షూట్ లో ఉంది, అలాగే నవంబర్ నుండి మరో సినిమా సెట్ మీదకు వెళ్లబోతుంది. ఇవి కాకుండా ఆల్ రెడీ మరో కథను ఓకే చేశాడని, ఈ సబ్జెక్ట్ ను స్టార్ రైటర్ అబ్బూరి రవి తెచ్చాడని, దాదాపు సినిమా కూడా ఓకె అయిందని తెలుస్తోంది. ఇక తేజు త్వరలోనే దేవా కట్టా డైరక్షన్ లో ఓ థ్రిల్లర్ సినిమా చేయనున్నాడు. ఇక ఆ తరువాత బివివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సాయి తేజ్ మళ్లీ మరో సినిమా చేయనున్నాడు.

ఇక మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ నటనలో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆ మధ్యన వరుస ప్లాపులతో కాస్త ఇబ్బంది పడినా… మళ్లీ వరుస హిట్స్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య అభిమానులకి దగ్గరకు ఉంటూ ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :

More