టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘కోర్ట్’ మూవీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్ట్ చేసిన ఈ కోర్టు రూమ్ డ్రామా చిత్రాన్ని న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ తమ కంటెంట్‌పై పూర్తి కాన్ఫిడెంట్ వ్యక్తం చేశారు.
ఓ సందర్భంగా నాని ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్ వ్యక్తం చేశాడంటే.. ‘కోర్ట్’ మూవీ నచ్చకపోతే ‘హిట్-3’ మూవీ చూడొద్దంటూ నాని ఛాలెంజ్ చేశాడు. ఇక ‘కోర్ట్’ మూవీ ప్రీమియర్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో తాజాగా దర్శకుడు శైలేష్ కొలను ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. ‘‘నా సినిమా సేఫ్’’ అంటూ ప్రభాస్ ‘మిర్చి’ సీన్ పిక్‌తో ‘కోర్ట్’ మూవీ రివ్యూని తనదైన మార్క్‌లో వెల్లడించారు.
‘కోర్ట్’ మూవీ ప్రతిఒక్కరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని.. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. ఇలాంటి సినిమాను అందించిన వాల్ పోస్టర్ సినిమా, నానితో అసోసియేట్ అయినందుకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ‘హిట్-3’ చిత్రానికి ‘కోర్ట్’ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నాని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.