సైంధవ్’ : సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

సైంధవ్’ : సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Dec 9, 2023 9:00 PM IST


విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ సైంధవ్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా కనిపించనుండగా కీలక పాత్రల్లో ఆర్య, రుహాణి శర్మ, ఆండ్రియా, జయప్రకాశ్ తదితరులు నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకోగా మూవీ నుండి సరదా సరదాగా అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ ని డిసెంబర్ 11న విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. వెంకటేష్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తుండగా దీనిని రానున్న సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు