స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు, టాలీవుడ్ హీరో సాయి రామ్ శంకర్ నటించిన కొత్త సినిమా ‘ఒక పథకం ప్రకారం’. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఇందులో సాయి రామ్ శంకర్ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా ఇచ్చిన తాజాగా ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు సాయిరాం శంకర్.
‘విలన్ ఎవరో ఇంటర్వెల్‌కు చెబితే రూ. 10,000 పట్టుకెళ్ళండి’, ‘పట్టుకుంటే 10 వేలు’ అంటున్నారు. అసలు ఈ ఐడియా ఎవరిది? రెస్పాన్స్ ఎలా ఉంది?
రెస్పాన్స్ అయితే అద్భుతంగా ఉంది. సినిమా పేరు, రిలీజ్ అవుతుందన్న విషయం తెలియడానికి ఇది బాగా ఉపయోగపడింది. మొదటి నుంచి ఇదొక్కటే అనుకున్నాం. సినిమా చూశాక మా యూనిట్‌లో కీలక సభ్యులు ‘పట్టుకుంటే పదివేలు’ అని చెప్పడంతో దీన్నే ఫిక్స్ అయ్యాము.
‘ఒక పథకం ప్రకారం’ అంటున్నారు… టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
‘ఒక పథకం ప్రకారం’ అంటే 80% క్రైమ్ జానర్ కథలకు వాడతాం. ఈ సినిమాలో ఉండే ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది. కాబట్టి ‘ఒక పథకం ప్రకారం’ అనే టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం.
సముద్రఖని గారితో వర్క్ చేశారు కదా. ఏం నేర్చుకున్నారు?
ఆయన ఆల్రెడీ సక్సెస్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటుడు. డైరెక్టర్ కి ఏం కావాలో అదే చేస్తారాయన.
పూరి జగన్నాథ్ ట్రైలర్ చూశారా? ఆయన రియాక్షన్ ఏంటి?
అన్నయ్య ట్రైలర్ చూశారు. కొత్తగా ఉందని అన్నారు. అలాగే పట్టుకుంటే రూ. 10,000 గురించి కూడా చెప్పాను.
ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి?
మూవీ 50 సెంటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇందులో నా పాత్ర క్రిమినల్ లాయర్. నెమ్మదిగా నా క్యారెక్టర్ లో ఒక్కో షేడ్ బయట పడుతుంది. క్రిమినలా లేకపోతే క్రిమినల్ లాయరా అనిపించేలా ఉంటుంది. అయితే ఈ సినిమాలో నా పాత్ర కోసం వన్ మంత్ ట్రైనింగ్, వర్క్ షాప్స్ కూడా చేశాను.
షూటింగ్ చేసేటప్పుడు ఏదైనా మర్చిపోలేని అనుభవం?
షూటింగ్ కోసం 25 డాగ్స్ తెచ్చాము. ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ ఏకంగా 4 రోజులు చేశారు. ఆ టైంలో డాగ్ పైకి బయటకు రావడంతో, గ్రిల్ ఎక్కేశాను. లక్కీగా ఎస్కేప్ అయ్యాను. ఆ ఫైట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక క్లైమాక్స్ సీన్ తీసి, సరిపోట్లేదని మళ్లీ ఎక్స్టెండెడ్ వెర్షన్ తీశారు డైరెక్టర్. ఏడెనిమిది రోజులు క్లైమాక్స్ కోసమే షూటింగ్ చేశాం.
‘ఒక పథకం ప్రకారం’ విడుదల రోజు ‘తండేల్’ కూడా రిలీజ్ కాబోతోంది. మీరేం అనుకుంటున్నారు?
పోటీ ఏముంది? మేము ‘తండేల్’తో పాటు రిలీజ్ చేయట్లేదు. ‘తండేల్’ పక్కన రిలీజ్ చేస్తున్నాం.