పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మొట్ట మొదటిగా చేసిన సినిమా ఇది కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మరి ఈ క్రమంలో రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా రికార్డు రెస్పాన్స్ క్లాక్ చేయగా ఈ ట్రైలర్ పట్ల కాస్త అసంతృప్తి కూడా కొందరిలో ఉంది.
అయితే ఈ ట్రైలర్ ని మించి మరో సాలిడ్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గరలో ప్లాన్ చేస్తున్న ఈ ట్రైలర్ అయితే మరింత వైలెంట్ గా ఉంటుంది అని టాక్ వినిపిస్తుంది. మొత్తం కూడా ఒక పవర్ఫుల్ యాక్షన్ కట్ తో అయితే ఈ ట్రైలర్ ఉంటుంది అని సమాచారం. మొత్తానికి అయితే ప్రభాస్ మరియు యాక్షన్ మూవీ లవర్స్ కోరుకుంటున్న ఆ సాలిడ్ ట్రీట్ ని మేకర్స్ మరికొన్ని రోజుల్లో అందించనున్నారు అని చెప్పాలి.