“సలార్” ట్రైలర్ ని చిన్న మార్పులతో అప్డేట్ చేసిన మేకర్స్.!

“సలార్” ట్రైలర్ ని చిన్న మార్పులతో అప్డేట్ చేసిన మేకర్స్.!

Published on Dec 3, 2023 7:02 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మాసివ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. మరి దీని నుంచి మేకర్స్ మొన్ననే అవైటెడ్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చేయగా దానికి రికార్డు రెస్పాన్స్ అయితే నమోదు అయ్యింది. కానీ ఈ ట్రైలర్ పట్ల కొంత మేర మిక్స్డ్ రెస్పాన్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని డైలాగ్స్ విషయంలో ఆడియెన్స్ ఇష్యూ రైజ్ చేసారు. మరి దీనితో మేకర్స్ అయితే ఇప్పుడు వీటిని సరి చేసినట్లు తెలుస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అలాగే ప్రభాస్ డైలాగ్స్ ని కొంచెం మార్పులు చేసి ఇప్పుడు ట్రైలర్ లో అప్డేట్ చేశారు. అలాగే సబ్ టైటిల్స్ ని కూడా మార్చినట్టు తెలుస్తోంది.

మరి ఈసారి చూసిన కొందరు ఫ్యాన్స్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది అంటున్నారు. అయితే లాస్ట్ టైం టీజర్ కి కూడా మేకర్స్ చిన్న చిన్న మార్పులు చేసి అప్డేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబలే నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు