అక్కడ 200 కోట్ల క్లబ్ దిశగా “సలార్”

అక్కడ 200 కోట్ల క్లబ్ దిశగా “సలార్”

Published on Jan 7, 2024 8:41 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం హిందీ భాషలో కూడా డీసెంట్ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. ఈ చిత్రం అక్కడ 200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 200 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రం కి షారూఖ్ ఖాన్ డన్కి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు