రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం యూఎస్ ప్రాంతం లో భారీ నంబర్స్ ను నమోదు చేసుకుంటుంది.
ఈ చిత్రం ఇప్పటి వరకూ అక్కడ 6.8 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టడం జరిగింది. త్వరలో ఈ సినిమా 10 మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.