లేటెస్ట్ : ‘సలార్’ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ ?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్ కూడా ఒకటి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని అత్యంత భారీ వ్యయంతో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా ఈ మూవీ యొక్క ఓవర్సీస్ రైట్స్ ని భారీ ధరకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ ఎల్ ఎల్ సి వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక సలార్ కి మరోవైపు అన్ని ప్రాంతాల నుండి కూడా భారీ స్థాయి బిజినెస్ ఆఫర్స్ వస్తుండగా రాబోయే రోజుల్లో మిగతా ఇతర ప్రాంతాల యొక్క బిజినెస్ డీల్స్ కూడా జరుగనున్నట్లు తెలుస్తోంది. మరి అందరిలో ఎంతో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version