సూపర్ స్టార్ సినిమాలో ‘సలార్’ విలన్ ?

సూపర్ స్టార్ సినిమాలో ‘సలార్’ విలన్ ?

Published on Oct 23, 2023 1:00 PM IST

కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్, విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘లియో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్నా, కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇక లియో తెరపైకి రాకముందే, లోకేశ్ కనగరాజ్ లెజెండరీ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘తలైవర్ 171’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఈ ‘తలైవర్ 171’లో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో స్టార్ట్ కానుంది. అన్నట్టు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటికే ప్రభాస్ యాక్షన్ చిత్రం సలార్‌ లో కూడా విలన్ పాత్రను పోషించాడు, సలార్ డిసెంబర్ 22, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు