బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్లో ‘సికందర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రీసెంట్గా ప్రారంభించగా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, హీరో సల్మాన్ ఖాన్‌కి గాయం అయినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సల్మాన్‌కి స్వల్ప గాయం అయ్యిందని.. దాన్ని పట్టించుకోకుండా ఆయన షూటింగ్లో పాల్గొంటున్నారని బిటౌన్ మీడియా తెలిపింది. తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో సల్మాన్ కాస్త అసౌకర్యంగా కనిపించాడని వారు తెలిపారు. అయితే, చింతించాల్సిన అవసరం లేదని.. ఆయన వైద్యుల సూచన మేరకే షూటింగ్లో పాల్గొంటున్నాడని తెలుస్తోంది.
ఇక ‘సికందర్’ చిత్రాన్ని మురుగదాస్ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.