బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆలోచనల పై దర్శకుడు సూరజ్ భర్జాత్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. . సల్మాన్ ఖాన్ కెరీర్ లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’కి దర్శకత్వం వహించింది సూరజ్ భర్జాత్యనే. ఐతే, ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన సోనమ్ కపూర్ కథానాయికగా నటించి మెప్పించింది. కానీ, సల్మాన్ ఖాన్ మొదట ఆమెను హీరోయిన్గా నిరాకరించాడట. కారణం అడిగితే.. మా మధ్య దాదాపు 20 ఏళ్ల గ్యాప్ ఉంది. అన్నిటికి కంటే ముఖ్యంగా ఆమె నా ముందే పెరిగింది. తన ఎదుగుదలను నేను చూశాను. నా కూతురు లాంటి అమ్మాయితో ఎలా నటించాలి’ అని సల్మాన్ నిరాకరించాడట.
కాకపోతే, దర్శకుడు సూరజ్ భర్జాత్యకి మాత్రం ఆ పాత్రకు సోనమ్ కపూర్ అయితేనే బాగుంటుంది అని గట్టిగా నమ్మాడు. అదే విషయాన్ని సల్మాన్ తో చెప్పి చివరకు ఒప్పించాడు. షూటింగ్ లో మాత్రం సల్మాన్ ఖాన్ చాలా ఇబ్బంది పడ్డాడట. నా కూతురు లాంటి అమ్మాయితో నేను ఎలా క్లోజ్డ్ గా నటించాలి ? అంటూ సల్మాన్ అంటుండే వారట. సల్మాన్ ఖాన్ ఆలోచనలు అంత సున్నితంగా ఉంటాయని దర్శకుడు సూరజ్ భర్జాత్య చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ సరసన సోనమ్ కపూర్ కథానాయికగా చాలా బాగా నటించింది.