అందుకే ఇక్కడికి వచ్చాను – సల్మాన్‌ ఖాన్‌

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కి గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి వరుస బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సల్మాన్ బిగ్‌బాస్‌ షూట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షూట్‌కు సంబంధించిన ఒక ఎపిసోడ్‌ శనివారం ప్రసారం అయ్యింది. అయితే, ముందు ఉన్నంత యాక్టివ్‌గా ఈ ఎపిసోడ్ లో సల్మాన్‌ కనిపించకపోవడం స్పష్టంగా తెలుస్తోంది. కాగా కంటెస్టెంట్స్‌ ఈ వారం మొత్తం చేసిన తప్పొప్పుల గురించి సల్మాన్ మాట్లాడారు.

ఇందులో భాగంగా సల్మాన్ మాట్లాడుతూ.. ‘‘‘హౌస్‌లో ఉన్నప్పుడు ఇంటి సభ్యులు ఎలాంటి ఫీలింగ్స్‌ చూపించినా వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేయాలి. నేను కూడా ఈ రోజు ఇక్కడికి రాకూడదనుకున్నాను. నిజానికి నాకు అస్సలు రావాలనిపించలేదు. మీతోపాటు ఎవరిని కలవకూడదనుకున్నాను. కాకపోతే ఇది నా వృత్తి. కాబట్టి తప్పకుండా రావాలి. వృత్తిపట్ల ఉన్న నిబద్ధత వల్లే నేను ఇక్కడికి వచ్చాను’ అంటూ సల్మాన్‌ ఖాన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Exit mobile version