మురుగదాస్ సినిమా కోసం సల్మాన్ స్టన్నింగ్ పిక్ వైరల్

మురుగదాస్ సినిమా కోసం సల్మాన్ స్టన్నింగ్ పిక్ వైరల్

Published on Sep 25, 2024 11:20 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “సికందర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంతో మరోసారి సల్మాన్, మురుగదాస్ లు కలవడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా కోసం సల్మాన్ ప్రిపేర్ చేస్తున్న లేటెస్ట్ లుక్ అయితే వైరల్ గా మారింది.

సల్మాన్ ఎక్స్ ఖాతా నుంచి ఈ సినిమా కోసం జిమ్ లో చెమటలు చిందిస్తున్న పిక్ ని షేర్ చేసాడు. ఇందులో సల్మాన్ సాలిడ్ ఫిజిక్ అండ్ తన ఇంటెన్స్ కళ్ళని చూడవచ్చు. దీనితో ఈ సినిమాలో కూడా తన పర్సనాలిటీతో అదరగొట్టనున్నాడని చెప్పాలి. మరి ఈ సినిమాలో కూడా మురుగదాస్ భారీ యాక్షన్ సీన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి ఈసారి సల్మాన్ తో యాక్షన్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది. ఇక ఈ చిత్రానికి సాజిద్ నదియాద్వాలా నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు