ప్రస్తుతం ‘పుష్ప-2’కి సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు వెంటనే అలర్ట్ అవుతున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అంచనాలు పీక్స్‌కి చేరాయి. ఇక ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే, ఈ సినిమాకు బీజీఎం మ్యూజిక్ కోసం సామ్ సిఎస్ కూడా వర్క్ చేశారు.
తాజాగా ఆయన ‘పుష్ప-2’లో తన జర్నీ పై స్పందించారు. తన సోషల్ మీడియా అకౌంట్‌లో సామ్ సిఎస్ ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. ‘‘పుష్ప-2లో నా జర్నీ మర్చిపోలేనిది. ఈ సినిమా కోసం నాపై నమ్మకంతో నిర్మాతలు నాకు ఈ అవకాశం ఇవ్వడం నేను ఎప్పటికీ మర్చిపోను. వారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అల్లు అర్జున్ కూడా నాపై నమ్మకంతో ఈ చిత్రానికి సాలిడ్ బీజీఎం అందించడంలో ఎంకరేజ్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు.’ అంటూ సామ్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
దీంతో పుష్ప-2 చిత్రంలో సామ్ సిఎస్ బీజీఎం అందించిన ఎపిసోడ్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కాకుండా మరో ముగ్గురు సంగీత దర్శకులు వర్క్ చేసినట్లు తెలుస్తోంది.