హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’. కాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సిరీస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతుంది. ఇందులో భాగంగా తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సిరీస్ దర్శక ద్వయం ‘రాజ్ అండ్ డీకే’ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఇంతకీ, సమంత వారి గురించి ఏం మాట్లాడింది అంటే.. ‘రాజ్ అండ్ డీకేతో కలిసి పని చేయడం ఎంతో కష్టం. తెలుగు, తమిళం చిత్రాల్లో వర్క్ చేయడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇప్పటివరకు చేసిన నా సినిమాల్లో ఒక రోజుకు రెండు లేదా మూడు సీన్స్ మాత్రమే షూట్ చేసేవాళ్ళు. కానీ, రాజ్ అండ్ డీకే మాత్రం ఒక గంటలోనే ఆ సీన్స్ షూట్ చేస్తారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో నేను చేసిన రాజీ పాత్రకు సంబంధించిన చాలా సన్నివేశాలు, ఫైట్ సీక్వెన్స్‌లను మొదటి షెడ్యూల్‌లోనే తీసేశారు. రెండు రోజుల తర్వాత ఏడ్చుకుంటూ మా మేనేజర్‌కు ఫోన్ చేసి.. ఇక నా వల్ల కాదు. నేను చేయలేను అని చెప్పా. ఆ తర్వాత వారి వర్కింగ్ స్టైల్‌కు అలవాటు పడ్డాను’ అంటూ సమంత చెప్పుకొచ్చింది.