బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగ్రా’ దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఈ సినిమాను తెలుగులోనూ మంచి బజ్‌తో రిలీజ్ చేయనున్నారు.
తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి టాలీవుడ్ నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, స్టా్ర్ బ్యూటీ సమంత, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి గెస్టులుగా హాజరయ్యారు.
ఈ క్రమంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అన్ని చోట్లా కూడా ఒకే రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్‌లో రజినీకాంత్ తరువాత సమంత మాత్రమే ఉందని త్రివిక్రమ్ అన్నారు. దీంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక సమంత తెలుగులో తిరిగి స్ట్రెయిట్ మూవీ ఎప్పుడెప్పుడు చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.