సమంత ఇన్‌స్టా పోస్ట్.. వారికి సైలెంట్‌గా కౌంటర్ ఇచ్చిందా?

స్టార్ బ్యూటీ సమంత గతకొంత కాలంగా పర్సనల్ కారణాల వల్ల అన్నింటికీ దూరం ఉంటూ వచ్చింది. తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్యతో విడాకుల తరువాత సామ్ తిరిగి తన కెరీర్‌పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. అయితే, రీసెంట్‌గా నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో మరోసారి సమంత నెట్టింట ట్రెండ్ అయ్యింది. కానీ, ఆ సమయంలో ఆమె రెస్పాండ్ అవలేదు.

ఇక ప్రస్తుతం సమంత ఓ డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతోంది. ఆ డైరెక్టర్‌తో వర్క్ చేసిన సమంత, అతడితో ప్రేమలో పడిందని.. ప్రస్తుతం వారిద్దరు డేటింగ్ చేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, ఈ రూమర్స్‌పై కూడా సామ్ సైలెంట్‌గా ఉంది. కానీ, తాజాగా సామ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో సామ్ వేసుకున్న షర్ట్‌పై ‘‘ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్’’ అనే లైన్ ఉంది. బయట ఎన్ని వార్తలు, పుకార్లు వచ్చినా, తాను సైలెంట్‌గా ఉంటానంటూ ఆమె ఈ ఒక్క ఫోటోతో చెప్పేసింది. నిజానికి ఆమెపై వస్తున్న పుకార్లకు ఆమె ఈ విధంగా కౌంటర్ ఇచ్చేసిందని ఆమె అభిమానులు అంటున్నారు.

Exit mobile version