స్టార్ హీరో సినిమాను ఓకే చేసిన సమంత‌

స్టార్ హీరో సినిమాను ఓకే చేసిన సమంత‌

Published on Jun 13, 2024 6:10 PM IST

స్టార్ బ్యూటీ స‌మంత లాస్ట్ మూవీ ‘ఖుషి’ త‌రువాత మ‌ళ్లీ ఇప్ప‌టివ‌ర‌కు వెండితెర‌పై క‌నిపించ‌లేదు. అయితే, ఆమె సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెబ్ సిరీస్ లు, యాడ్స్ ల‌లోనే సామ్ క‌నిపిస్తుండ‌టంతో, ఆమె ఇప్ప‌ట్లో సినిమా చేస్తుందా.. లేదా.. అని అంద‌రూ అనుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ సినిమాలో న‌టించేందుకు సామ్ ఒప్పుకున్న‌ట్లుగా ఓ వార్త ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.

మ‌ల‌యాళ మెగాస్టార్ మమ్ముట్టి న‌టించ‌బోయే ఓ సినిమాలో స‌మంత కూడా యాక్ట్ చేయ‌నుందట‌. ఈ సినిమాను గౌత‌మ్ మీనన్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ చిత్రంలో న‌టించేందుకు సామ్ ఒప్పుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఆమె కెరీర్ లో ‘ఏ మాయ చేశావే’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందించిన ఈ డైరెక్ట‌ర్ తో ఇప్పుడు మ‌రో సినిమా చేసేందుకు సామ్ రెడీ అయ్యింది.

అయితే, ఈ సినిమాలో సామ్ ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తుంద‌నే విష‌యంపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. సామ్ కు ఇది ఫ‌స్ట్ మ‌ల‌యాళం సినిమా కావ‌డం విశేషం. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు