ఆ భారీ సిరీస్ లో “మిర్జాపూర్” నటుడితో సమంత


రీసెంట్ గా మన ఇండియన్ ఓటిటి దగ్గర రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ సిరీస్ సీక్వెల్ ఏదన్నా ఉంది అంటే అది సాలిడ్ హిట్ సిరీస్ “మిర్జాపూర్ 3” అని చెప్పాలి. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చి రికార్డు రెస్పాన్స్ ని ఈ సిరీస్ అందుకుంది, అయితే ఈ సిరీస్ లో ప్రముఖ నాటుదులు అలీ ఫజల్ సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచిన సంగతి తెలిసిందే. మరి నటుడితో స్టార్ హీరోయిన్ సమంత ఓ వెబ్ సిరీస్ లో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టుగా తెలుస్తుంది.

రీసెంట్ గానే సమంత “తుంబాడ్” (Tumbbad) గేమ్ దర్శకుడు రాహి అనిల్ బర్వె తెరకెక్కించనున్న భారీ సిరీస్ కి ఓకే చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సిరీస్ లో అయితే ఈమె అలీ ఫజల్ సరేనా నటిస్తున్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది. దీనితో ఇదొక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అని చెప్పాలి. మరి ఈ సిరీస్ ని “ది ఫ్యామిలీ మ్యాన్” దర్శకులు రాజ్ అండ్ డీకే లు నిర్మాణం వహిస్తుండగా ఇది కూడా ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సిరీస్ సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకి రానున్నాయి.

Exit mobile version