ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో సమంత లేటెస్ట్ వెబ్ సిరీస్.!

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో సమంత లేటెస్ట్ వెబ్ సిరీస్.!

Published on Jul 20, 2024 5:03 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్ళీ తన హెల్త్ నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సమంత ఇప్పుడు పలు చిత్రాలతో పాటుగా పలు వెబ్ సిరీస్ లు కూడా సమంత చేస్తుండగా ఈ సిరీస్ లలో బాలీవుడ్ భారీ బడ్జెట్ సిరీస్ ని ఆమె ఓకే చేసినట్టుగాఇది వరకే టాక్ వచ్చింది.

తన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే కాంబినేషన్ లోనే ఈ సిరీస్ తెరకెక్కిస్తుండగా ఇపుడు అసలు ఈ సిరీస్ ఏ తరహా కాన్సెప్ట్ లో కనిపిస్తుందో ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సిరీస్ అయితే భవిష్యత్తు కాలంలో కనిపించే సిరీస్ గా భారీ బడ్జెట్ లో తెరకెక్కబోతుంది అని వినిపిస్తుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే ఈ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్, మేల్ లీడ్ లో కనిపించనుండగా “తుంబాడ్” దర్శకుడు రాహి అనిల్ తెరకెక్కించనున్నారు. దీనితో ఈ సిరీస్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు