సక్సెస్ఫుల్ గా 25 డేస్ కంప్లీట్ చేసుకున్న సమంత ‘యశోద’

Published on Dec 5, 2022 10:35 pm IST

టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సక్సెస్ఫుల్ మూవీ యశోద. యువ దర్శక ద్వయం హరి, హరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించగా మణిశర్మ సంగీతం అందించారు. సరోగసి నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ సైంటిఫిక్ డ్రామా మూవీ గా రూపొందిన యశోద ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ టాక్ ని, మంచి కలెక్షన్ ని అందుకున్న సంగతి తెలిసిందే.

సమంత సూపర్ గా పెర్ఫార్మన్స్ కనబరిచిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజ్, ఉన్ని ముకుందన్, రావురమేష్ తదితరులు కీలక పాత్రలు చేసారు. అయితే యశోద మూవీ నేటితో సక్సెస్ఫుల్ గా 25 డేస్ కంప్లీట్ చేసుకోవడంతో తమ మూవీని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతూ యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. కాగా అతి త్వరలో యశోద ఒటిటి ఆడియన్స్ ముందుకి రానున్నట్లు తెలుస్తోంది. దానికి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :