టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరైన సమంత రూత్ ప్రభు ప్రస్తుతం హీరోయిన్ గా మంచి క్రేజ్ తో పలు సక్సెస్ లతో కొనసాగుతున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఖుషి మూవీ మంచి సక్సెస్ సాధించి నటిగా ఆమెకు మరింత మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. తాజాగా సిటాడెల్ సిరీస్ లో నటిస్తున్న సమంత తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
అది కూడా ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీ ఏకంగా కండల వీరు సల్మాన్ ఖాన్ తో ఫిక్స్ అయింది. ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ పై కరణ్ జోహార్ నిర్మాతగా విష్ణువర్ధన్ తెరకెక్కించనున్న క్రేజీ ప్రాజక్ట్ లో ఆమె హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా రాజి పాత్ర తో హిందీ ఆడియన్స్ నుండి కూడా పేరు సొంతం చేసుకున్న సమంత కి ఈ మూవీ ఛాన్స్ మరింత మంచి పేరు తెచ్చిపెట్టే అవకాశం ఉందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కాగా ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ నుండి అధికారికంగా అనౌన్స్ కానున్నాయి.