సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తోంది. తాజాగా తన లేటెస్ట్ క్రేజీ ఓటిటి ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. రాజ్ మరియు డికె దర్శకత్వం వహించే వెబ్ సిరీస్‌లో సమంత హ్యాండ్సమ్ హంక్ వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయనున్న విషయం తెలిసిందే. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌కి రంగం సిద్ధమైందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
ఇది అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్ యొక్క భారతీయ వెర్షన్ అని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి భారీ యాక్షన్ బ్లాక్‌లు అవసరం. అయితే లేడీ పెయిర్ అందుకు తగ్గట్లు గా ప్రిపేర్ కావాల్సి ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత రాజ్ మరియు డికెతో సామ్ చేస్తున్న రెండవ ప్రాజెక్ట్ కావడం తో దీని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.